Latest News
Thursday 25 December 2014

అఖిల్‌ గుడ్‌ డెసిషన్‌

అఖిల్‌ గుడ్‌ డెసిషన్‌

తొలి సినిమానే భారీగా చేసేస్తే, ఆ సినిమా ద్వారా వచ్చే ఇబ్బందులేంటో అఖిల్‌ ముందే పసిగట్టినట్లున్నాడు. అందుకే భారీ బడ్జెట్‌ జోలికి వెళ్ళకుండా ఓ మోస్తరు బడ్జెట్‌తోనే తొలి సినిమా చేస్తే బావుంటుందనే నిర్ణయానికి వచ్చాడట అఖిల్‌. ఈ విషయాన్ని హీరో నితిన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచాడు. హీరోగా అఖిల్‌ తెరంగేట్రానికి నిర్మాతగా నితిన్‌ వ్యవహరిస్తోన్న విషయం విదితమే. 

నితిన్‌, తన తండ్రి కలిసి హీరోగా అఖిల్‌ నటించనున్న తొలి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌కి సినిమాపై మంచి అవగాహన వుందనీ, చాలాకాలం నుంచీ తనకు అఖిల్‌ మంచి స్నేహితుడనీ, తన తండ్రికీ, నాగార్జునకీ సన్నిహిత సంబంధాలున్నాయనీ.. అలా ఈ ప్రాజెక్ట్‌ వర్కవుట్‌ అయ్యిందని నితిన్‌ అంటున్నాడు. 

ఇక, అఖిల్‌ హీరోగా తెరంగేట్రం చేయనున్న చిత్రానికి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వినాయక్‌ అంటే సుమో ఛేజ్‌లు.. భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌.. అలాంటిది అఖిల్‌ సినిమాకి ఓ మోస్తరు బడ్జెట్‌ అంటే అంత నమ్మశక్యంగా లేదు. అయితే నిర్మాత నితిన్‌ చెబుతున్నాడు కాబట్టి నమ్మాల్సిందే. ఓ మోస్తరు బడ్జెట్‌లోనే అఖిల్‌ తన తొలి సినిమా చేస్తే, ఆ ఆలోచన చేసినందుకు అఖిల్‌ని అభినందించాలి. 

See more at: http://telugu.greatandhra.com/movies/movie-news/akhil-good-decission-58304.html#sthash.v7p4jOT2.dpuf

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అఖిల్‌ గుడ్‌ డెసిషన్‌ Rating: 5 Reviewed By: DMM