Latest News
Wednesday 24 December 2014

రివ్యూ : ముకుంద



గోపికను మరచిన ముకుందుడు - ముకుంద : 
రేటింగ్ : 3/5
కొత్త‌బంగారులోకం’లో కథేంటి..? ’సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ సినిమాలో స్టోరీ ఎంటబ్బా.. ? అంటే.. కాస్త ఆలోచించాల్సిందే. తీరా ఆలోచిస్తే.. కథేమీ లేదే అనిపిస్తోంది సినిమా చూసిన ప్రేక్షకుడికి. శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో క‌థ‌లకు అంత స్కోప్ ఉండ‌దు. అందులో నాట‌కీయ‌త కంటే.. స‌హ‌జ‌త్వ‌మే ఎక్కువ క‌నిపిస్తుంది. ఈసారి శ్రీకాంత్ సహజత్వానికే ఓటేశాడు. వరుణ్ తేజ్ ని ఓ సామాన్య కుర్రాడిలా చూపించాడు. సామాన్య కుర్రాడిలో వుండే బాగోద్వేగాలను ఆవిష్కరించారు. యూత్‌ ప్రేమ, వాళ్ల ప్రేమను పెద్దలు అడ్డుకోవడం.. ఇదే ముుకుంద స్టోరి. మరీ.. ముకుంద మురిపించిందా.. ? లేదా.. ? అన్నది తెలుసుకుందాం… పదండీ..
ప‌ల్లెటూరికీ, ప‌ట్నానికీ మ‌ధ్య‌స్థంగా ఉండే ఓ మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో ముకుంద (వ‌రుణ్‌తేజ్ ) అనే కుర్రాడు. ముక్కుసూటి వ్య‌క్తిత్వం గలవాడు. స్నేహితులంటే ప్రాణం. స్నేహితుల్లో అర్జున్ అంటే ఇంకా ఇష్టం. ముస్సిపల్ చైర్మెన్ సుబ్రహ్మణ్యం (రావు రమేష్) కి ప‌ద‌వీ వ్యామోహం. 25యేళ్లుగా చైర్మ‌గా గెలుస్తూ వ‌చ్చాడు. ఈసారీ ఎలాగైనా గెల‌వాల‌న్న కసితో వుంటాడు. సుబ్రహ్మణ్యం త‌మ్ముడు కూతుర్ని అర్జున్ ప్రేమిస్తాడు. ఇంకేముంది.. అర్జున్ ని అంతమొందించేందుకు ప్రయత్నిస్తారు. ప్రతిసారి ముకుంద అడ్డువస్తాడు. చివరకు ముకుంద ను మట్టుపెట్టాలని ప్లాన్ చేస్తారు. ఇంకో విశేమేమిటంటే.. ముకుంద రావు రమేష్ కూతురు పూజ (పూజ హెగ్డే) ని ప్రేమిస్తాడు. కానీ చెప్పడు. ఈలోగా ఈసారి ఎన్నిక‌ల్లో సుబ్ర‌హ్మ‌ణంని ఓడించేందుకు ప్రకాష్ రాజ్ ని రంగంలో దింపుతాడు హీరో. మరీ.. ప్రకాష్ రాజ్ ఆ ఎలక్షన్ లో గెలుపొందాడా..? స్నేహితుడైన అర్జున్ ని ముకుంద కాపాడాడా..? ముకుంద ప్రేమ ఏ తీరం చేరిందన్నది చిత్ర కథ.
వ‌రుణ్ తేజ్ తొలి సినిమా ఇది. మెగా హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ మూవీ అంటే… పాట‌లూ, ఫైట్స్‌, భారీ హంగామా ఆశించ‌డం సహజమే. అయితే.. వాటి కోసం దర్శకడు ఉరుకులు పెట్టలేదు. అటు అభిమానుల అంచ‌నాలు అందుకొంటూనే, త‌న ప‌రిధిని దాట‌కుండా మేనేజ్ చేశాడు. ఫైట్లు చేయించి.. వరుణ్ తేజ్.. యాక్షన్ చిత్రాలకు రెడీ అనే సంకేతాల్ని ఇచ్చేశాడు. రావుర‌మేష్ విల‌నిజం ఈ సినిమాకే హైలెట్. వరుణ్ తేజ్ – రావు రమేష్ మధ్య జరిగే సంభాషణలు కొద్దిరోజు గుర్తుండిపోతాయి. ఈ సంభాషణలే ముకుందకు ప్రధాన బలం. శ్రీ‌కాంత్ అడ్దాల ఈ సారి క‌థ‌కుడు కంటే, ద‌ర్శ‌కుడు కంటే సంభాష‌ణ ర‌చ‌యిత‌గానే ఎక్కువ మార్కులు తెచ్చుకొంటాడు. ఎందుకంటే మాట‌లు అంత ముచ్చ‌ట‌గా ఉన్నాయి. విశ్రాంతికి ముందు ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశాడు. అయితే ఆ ట్విస్ట్‌లో బ‌లం లేక‌పోవ‌డం, సెకండాఫ్‌లోని స‌న్నివేశాల‌న్నీ సాదాసీదాగా సాగ‌డం ఈసినిమాని యావరేజ్ గా నిలిపాయి.
ముకుందలో వరుణ్ చాలా వరకు నోరు మూసుకొని వుండటమే ఎక్కవ. ఇక, ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్లు ఒక్కసారి కూడా చూసుకోరు. అసలు సినిమా అయిపోయే వరకు వీరిద్దరు ఒక్కసారి కూడా మాట్లాడుకోరు. కానీ, డ్యుయెట్లు పాడుకొంటారు. ఇది టాలీవుడ్ కి కొత్త ఫార్ములానే అని చెప్పాలి. వరుణ్ చూడ్డానికి సూపర్. ఆ హైటూ.. వెయిట్.. స్మయిలూ.. అన్నీ బాగున్నాయి. కానీ.. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ మాత్రం నిల్. ఎప్పుడూ ఒకటే ఫీల్. ఇది మరి కావాలని చేశారా..? లేదా.. వరుణ్ క్యాపబులిటినే అంతా.. ? అన్నది తెలీదు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో ఆమె కు అంత స్కోప్ లేదు.
మిక్కీ పాట‌లు, పాట‌ల చిత్రీక‌ర‌ణ బాగుంది. ఆర్‌.ఆర్‌లోనూ ఓకే అనిపించాడు. సిరివెన్నెల సాహిత్యం ఆక‌ట్టుకొంటుంది. సినిమాకి ఛాయాగ్ర‌హ‌ణం ప్ర‌ధాన ఎస్సెట్‌. మూవీని చాలా రిచ్ గా తీర్చిదిద్దారు. ముకుంద ఆద్యంతం స్లో నేరేష‌న్‌ లోనే న‌డుస్తుంది. దీంతో… చూసే ప్రేక్షకుడు చాలా బోర్ గా ఫీలయ్యే అవుతాడు.
మల్టీప్లెక్స్ ప్రేక్షకుడిని ’ముకుంద’ మురిపించొచ్చు.. కానీ.. బీ, సీ సెంటర్లలో మాస్ ప్రేక్షకుడిని మాత్రం విపరీతంగా నిరాశ పరచవచ్చు. శ్రీకాంత్ అడ్డాల కథనం, రావు రమేష్ నటన ను, మిక్కి పాటలను ఇష్టపడేవారు ముకుంద కు నిరంతరభ్యంగా వెళ్లవెవచ్చు. ’ముకుంద’లో వరుణ్ తేజ్ పాస్ మార్కులు వేయొచ్చు.. ఇక, తుదుపరి పరీక్షల్లో మెరిట్ సాధించడమే అతని టార్గెట్..
రేటింగ్ : 3/5
***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు

Source: http://www.telugumirchi.com/te/reviews/mukunda-telugu-movie-review-rating.html
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రివ్యూ : ముకుంద Rating: 5 Reviewed By: DMM