Latest News
Tuesday 24 February 2015

మీకు పురుషుడికి ఎడమ వైపునే స్త్రీ ఎందుకు వుంటుందో తెలుసా?

మీకు పురుషుడికి ఎడమ వైపునే స్త్రీ ఎందుకు 
వుంటుందో తెలుసా?

మీకు పురుషుడికి ఎడమ వైపునే స్త్రీ ఎందుకు వుంటుందో తెలుసా అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెబుతారు. కొంతమంది అయితే హృదయం ఎడమ వైపున వుంటుందని, హాస్యంగా నైతే జేబుకు దగ్గరగా వుంటుందని ఇలా రకరకాలుగా చెబుతారు. అయితే పూర్వకాలం నుంచి కూడా పురుషుడికి ఎడమ వైపునే స్త్రీ వుండడం మనం గమనిస్తుంటాం. దేవుని ఫొటోలు చూస్తే ఈ విషయం మనకు అర్ధమవుతుంది.

అయితే ఇలా వుండడానికి కారణం వుంది. అదేమిటంటే పూర్వకాలం లో పురుషులు అందరూ ఇంచుమించుగా ఆయుధం ధరించేవారు. సాధారణంగా ఇది ఎడమ వైపున వుంటుంది. అంటే దానిని తీయవలసి వస్తే కుడి చేతితో తీయాలి. అటువంటప్పుడు కుడివైపున స్త్రీ వున్నట్లయితే ఆయుధం చేపట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే స్త్రీలు ఎడమ వైపున ఉండేవారు.

కాలక్రమంలో ఆయుధాలు పోయినా ఈ ఎడమ వైపున వుండే సాంప్రదాయం మాత్రం పోలేదు అని అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు ఒప్పో మీ స్పందన తెలియచేయగలరు.

--తెలుగు స్నెహితులు బ్లాగ్ నుంచి.
  • Blogger Comments
  • Facebook Comments

1 comments:

Item Reviewed: మీకు పురుషుడికి ఎడమ వైపునే స్త్రీ ఎందుకు వుంటుందో తెలుసా? Rating: 5 Reviewed By: DMM