Latest News
Thursday 25 December 2014

రివ్యూ : చిన్నదాన నీ కోసం – చిన్నదానిలో రొమాన్స్ తక్కువయింది…



రివ్యూ : చిన్నదాన నీ కోసం – చిన్నదానిలో రొమాన్స్ తక్కువయింది…
రేటింగ్ : 2.75/5

తొలి ప్రేమ సినిమా చూసి పవన్, కరుణాకరన్ లాకు వీరఅబిమాని గా మారిన నితిన్..20 ఏళ్ల తరవాత కరుణాకరన్ దర్శకత్వం లో నటించే అవకాశం చిన్నదాన నీ కోసం తో వచ్చింది. ఒకప్పుడు వరస ఫ్లాప్స్ ను చవిచూసిన నితిన్ ఈ మద్య కథ బాగుంటేనే సినిమా ఓకే చేస్తున్నాడు..అలా ఈరోజు ప్రేక్షేకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘చిన్నదాన నీ కోసం’. మరి ఎంత వరకు ప్రేక్షేకుల మన్నలను గెలుచుకుందో ఇప్పుడు చూద్దాం..
కథ :
నందిని (మిష్టి) డాన్స్, కరాటే మరియు యోగ వాటిలో ప్రాదాన్యం కలిగిన అమ్మాయి. ఓ రోజు నితిన్ (నితిన్) నందిని చూసి ఫస్ట్ లుక్ లోనే లవ్ లో పడతాడు. కానీ కొన్ని పర్సనల్ కారణాల వల్ల నందిని నితిన్ దూరం పెడుతుంది. అయిన కానీ నితిన్ వదలకుండా నందిని వెంట పడతాడు. ఓ రోజు నందినికి నితిన్ కి రెడ్డి బాగా దగ్గర అనే విషయం తెలుసుకొని నితిన్ ద్వారా రెడ్డి ని కలుసుకుంటుంది. అలా దగ్గరియి ఓ రోజు సడన్ గా నితిన్ కు చెప్పకుండా నందిని, రెడ్డి తీసుకోని యూరోప్ వెళ్ళిపోతుంది. అది తెలుసుకొని నితిన్ కూడా యూరోప్ కు వెళ్ళిపోతాడు. అక్కడ నితిన్ కి నమ్మలేని ఫ్లాష్ బ్యాక్ తెలుసుతుంది. ఇంతకి ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? అసలు రెడ్డి ఎవరు ? రెడ్డి కి నందిని కి సంబంధం ఏంటిది ? చివరికి నితిన్ ప్రేమ ను, నందిని ఒప్పుకుందా ? లేదా ? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే…
హైలైట్స్‌ :
నితిన్ పవన్ కి వీర అబిమాని అని మరో సారి నిరూపించుకున్నాడు. డాన్సు లో, డైలాగ్ డెలివరీ లో ఎక్కడ కూడా తన ఎనర్జీ ని తగ్గకుండా నటించాడు. ఈ చిత్రం లో నితిన్ చాల అందంగా కనిపిస్తాడు. మిష్టి చక్రవర్తి తెలుగు లో మొదటి చిత్రం అయిన బాగా చేసింది. సాంగ్స్ లో తన అందచెందలతో మురిపించింది. నితిన్ – మిష్తి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఆండ్రూ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అలీ, తాగుబోతు రమేష్ ల కామెడీ పర్వాలేదు. నాజర్, నరేష్, సితార వారి పాత్ర మేరకు బాగానే చేసారు. అనుప్ రుబిన్స్ సంగీతం చాల బాగుంది, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.
డ్రాబ్యాక్స్‌:
ముఖ్యంగా సినిమా కు పెద్ద డ్రా బ్యాక్ సెకండ్ హఫ్. ఫస్ట్ హఫ్ అంత కూడా హీరో, హీరోయిన్స్ మద్య రొమాంటిక్ సన్నివేశాలతో కాస్త కామెడీ, మూడు సాంగ్స్ తో ప్రేక్షేకుడు ఎంజాయ్ చేస్తాడు. ఇంటర్వెల్ లో వచ్చిన ట్విస్ట్ తో సినిమా చూసే వాళ్ళు సెకండ్ హాఫ్ లో ఏదో జరగబోతుంది అని భావిస్తాడు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 నిమిషాలకే సినిమా క్లైమాక్స్ ఏంటో అర్ధమయిపోతుంది. మధు – జోష్ రవి మద్య వచ్చే ‘గే’ కామెడీ చూసే వాళ్ళకు చిరాకు తెప్పించింది. సెకండ్ హఫ్ లో కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. స్టొరీ అంత బాగా సాగాదిసినంటు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఆడియన్స్ ను పెద్దగా ఫీల్ అయ్యే మాదిరి లేదు. ఏదో సినిమా అయిపొయింది మీరు లేవ్వండి అనే రీతిలో ఉంది.
సాంకేతిక వర్గం పనితీరు:
ప్రేమ కావ్యాలను తెరకెక్కించడం లో కరుణాకరన్ ది ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. తొలి ప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా , డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట ఇలా ఎన్నో మంచి చిత్రాలను అందిచాడు. ఈ చిత్రానికి కూడా కరుణాకరన్ నాయ్యామే చేసాడు అని చెప్పవచ్చు. ఇష్క్, గుండె జారి గల్లన్తయ్యిందే వంటి సూపర్ హిట్ చిత్రాలకు మాటలు రాసిన హర్షవర్ధన్ ఈ చిత్రం విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు.
అలాగే అనూప్ రూబెన్స్ – నితిన్ కాంబినేషన్ లో వచ్చిన నాల్గో చిత్రం. ఎక్కడ కూడా పాత ట్యూన్స్ వాడకుండా చాల కొత్తగా మ్యూజిక్ అందిచాడు. సినిమా కు మ్యూజిక్ చాల హెల్ప్ అయ్యందని చెప్పవచ్చు. ఖర్చు వెనకాడకుండా సినిమా చాల రిచ్ లేవలో తీసారు.
చిత్ర విశ్లేషణ:
పవన్ కళ్యాణ్ కి అబిమాని అనే చెప్పుకొనే కరుణాకరన్..అదే పవన్ చిత్రం అయిన ‘అత్తారింటికి దారేది’ కాస్త కామెడీ జోడించి ‘చిన్నదాన నీ కోసం’ అంటూ ప్రేక్షేకుల మీదకు వదిలాడు. పవన్ ఆ సినిమా లో అత్తకోసం ఇండియా కు వస్తే..ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ తన తాత కోసం వస్తుంది. సినిమా చూసినంత సేపు కూడా పవన్ సినిమా నే గుర్తుస్తుంది, తప్ప కొత్తగా సినిమా చూసిన ఫీల్ మాత్రం రాదు. కాస్త కామెడీ తో ఫస్ట్ హాఫ్ లాగించిన కరుణాకరన్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ ఊపు చుపించాలేకపోయాడు.
నితిన్ తమ ఓన్ బ్యానర్ ఫై హ్యాట్రిక్ కొట్టాలని మరి కరుణాకరన్ స్టొరీ కి ఓకే చెప్పాడు కానీ సినిమా చూస్తే మాత్రం హ్యాట్రిక్ మిస్ అయ్యాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్లస్ అయ్యింది ఎవరికీ అంటే హీరొయిన్ మిష్తి కి అని చెప్పవచ్చు. తెలుగు లో ఇమే నటించిన మొదటి చిత్రం అయిన కానీ ఫస్ట్ లుక్ లోనే మెప్పించింది. ఇప్పటికే కోలీవుడ్ లో , బాలీవుడ్ ఈ అమ్మడు నటించింది. ఓవరాల్ గా చెప్పాలి అంటే కరుణాకరన్ మార్క్ లేవలో కాస్త నిరశ పరిచింది.

Seemore: http://www.telugumirchi.com/te/reviews/chinnadana-nee-kosam-telugu-movie-review-rating.html
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రివ్యూ : చిన్నదాన నీ కోసం – చిన్నదానిలో రొమాన్స్ తక్కువయింది… Rating: 5 Reviewed By: DMM