Latest News
Monday 2 February 2015

అవమానాలకు ప్రతీకారంగానే బాహుబలి సీన్లు లీక్ : వర్మ వాంగ్మూలం!

అవమానాలకు ప్రతీకారంగానే బాహుబలి సీన్లు లీక్ : వర్మ వాంగ్మూలం!


మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలో మేనేజర్‌గా పని చేసే సమయంలో తాను పడిన అవమానాలు, కష్టాలకు ప్రతికారంగానే 'బాహుబలి' సీన్లు ఉద్దేశ్యపూర్వకంగానే లీక్ చేసినట్టు ఈ కేసులో అరెస్టు అయిన వర్మ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం. 
 
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న 'బాహుబలి' చిత్రంలోని కొన్ని సీన్లు యూ ట్యూబ్‌లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాజమౌళి ఫిర్యాదుతో వర్మ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు గతంలో మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలో మేనేజర్‌గా పనిచేసిన విషయం పోలీసు విచారణలో వెల్లడైంది. అతడు సంస్థ నుంచి ఇటీవల వెళ్లిపోయినట్టు తెలిసింది. మకుట సంస్థలో తనకు ఎదురైన అవమానాలకు ప్రతిగానే వర్మ సీన్లు లీక్ చేసినట్టు అంగీకరించినట్టు సమాచారం. 
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అవమానాలకు ప్రతీకారంగానే బాహుబలి సీన్లు లీక్ : వర్మ వాంగ్మూలం! Rating: 5 Reviewed By: DMM