Latest News
Tuesday 27 January 2015

కైకాల స‌త్య‌నారాయణ‌ను మ‌ర్చిపోయారా??

కైకాల స‌త్య‌నారాయణ‌ను మ‌ర్చిపోయారా??



కోట శ్రీ‌నివాస‌రావుకి ప‌ద్మ‌శ్రీ ఇచ్చారు. సంతోషం. కోట అందుకు నూటికి నూరుపాళ్లు అర్హుడు. మ‌రి... ఆయ‌న కంటే ముందొచ్చి `న‌వ‌ర‌స‌న‌ట‌నా సార్వ‌భౌమ‌` అని పిలిపించుకొన్న కైకాల స‌త్య‌నారాయ‌ణ మాటేంటి?? ఆయ‌న్ని అంత తేలిగ్గా ఎలా మ‌ర్చిపోయారు..?? కైకాల - కోట‌... వీరిద్ద‌రినీ బేరీజు వేయ‌డం లేదుగానీ.. వేస్తే మాత్రం కైకాల వైపే త్రాసు మొగ్గుతుంది. ఎన్టీఆర్‌లాంటి హేమా హేమీల‌తో ధీటుగా క‌ల‌సి న‌టించి, మెప్పించి శ‌భాష్ అనిపించుకొన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టాయ‌న‌. ఎస్వీఆర్ త‌ర‌వాత ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసిన మొన‌గాడాయ‌న‌. ఒక విధంగా కోట‌కు స్ఫూర్తి కూడా కైకాల స‌త్య‌నారాయ‌ణే. అన్ని పాత్ర‌లూ చేయ‌గ‌ల‌డు అనుకొన్న కోట కూడా.. పౌరాణికాలు చేయ‌లేడు. కానీ అందులోనూ కైకాల స‌త్య‌నారాయ‌ణ అద్భుతాలు సృష్టించిన సంగ‌తి ప‌ద్మ‌శ్రీ‌కి సిఫార్సు చేసిన నాయ‌కుల‌కు తెలియ‌లేదా..?? లేదంటే కైకాల న‌ట‌నాప‌టిమ అర్థం కాలేదా..?? కోట‌కి ప‌ద్మ‌శ్రీ ఇవ్వడంలో త‌ప్పేం లేదు.. కానీ అంత‌కంటే ముందు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు ఇచ్చుంటే బాగుండేది. ఇప్ప‌టికైనా మించిపోయిందేం లేదు. ఈసారైనా ప‌ద్మ‌శ్రీ లిస్టులో కైకాల పేరు చేర్చండి... ప్లీజ్‌!!

Source: http://www.teluguone.com/tmdb/news/No-Padma-Shri-for-Kaikala-Satyanarayana-tl-42527c1.html
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: కైకాల స‌త్య‌నారాయణ‌ను మ‌ర్చిపోయారా?? Rating: 5 Reviewed By: DMM