Latest News
Wednesday 7 January 2015

ఇక చిరంజీవిని తీర్చిదిద్దనున్న శంకర్‌...?

ఇక చిరంజీవిని తీర్చిదిద్దనున్న శంకర్‌...?

‘ఐ’ సినిమాతో విక్రమ్‌ను ఒక రేంజ్‌లో చూపించిన శంకర్‌..ఇప్పుడు చిరంజీవిని తనదైన శైలిలో చూపించే పనిలో పడ్డారని ఫిలింనగర్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో సినిమా రాబోతుందని పలుమార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..మళ్లీ ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. చిరంజీవి 150వ చిత్రంకోసం జాగ్రత్త వహిస్తున్న సంగతి తెలిసిందే..దానికోసం మెగాస్టార్‌ ఇప్పటికే అగ్ర దర్శకుల నుంచి టాలీవుడ్‌లో అగ్ర రచయిత వరకూ కథ వింటూనే ఉన్నారు..కానీ ఏ ఒక్కటి నచ్చినట్లు లేదు..తాజాగా ఇప్పుడు శంకర్‌ అయితే కరెక్ట్‌గా చూపించగల్గుతాడని చిరంజీవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వీరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయోగానీ పుకారు మాత్రం షికారు చేస్తూ ఎల్లలూ దాటుతుంది. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేవరకూ నమ్మకం ఉండదని పక్కాగా చెప్పవచ్చు..ఎందుకంటే ఇదే విషయంపై ఇప్పటికే పలుసార్లు వార్తలు విన్నాం..ఏది ఏమైనా గానీ చిరంజీవి 150 సినిమా నిర్మించడానికి చిరుతనయుడు రామ్‌చరణ్‌ వెయికళ్లతో వేచిచూస్తున్నాడు. ఈ సంవత్సరమైనా చిరు అభిమానుల కల నెరవేరుస్తారని ఆశిద్దాం.



Source: http://www.andhrajyothy.com/Artical.aspx?SID=74941&SupID=24
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఇక చిరంజీవిని తీర్చిదిద్దనున్న శంకర్‌...? Rating: 5 Reviewed By: DMM