Latest News
Friday 2 January 2015

ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మానియా

ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మానియా

ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా... ఎంత స్పీడ్ గా జనాలకు కనెక్ట్ అయ్యామన్నదే ముఖ్యం ...అన్నట్లు ట్విట్టర్ లో  సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మానియా కొనసాగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా పవన్ ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో  పవన్ ట్విట్టర్ ఖాతాను అభిమానులు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన  తొలి ట్వీట్‌ చేశారు. అలా అకౌంట్‌ ప్రారంభించారో , లేదో వెంటనే పవన్ కళ్యాణ్  అభిమానులు ఆ విషయాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేశారు. పవన్ కు ఫాలోవర్లు నిమిష నిమిషానికీ పెరగడం మొదలుపెట్టారు. కేవలం 40 నిమిషాల్లోనే పవన్ ట్విట్టర్ ఖాతాను 5వేల మందికి పైగా ఫాలోకాగా, తాజాగా ఆ సంఖ్య 62వేలకు చేరటం విశేషం. ఇక బాలీవుడ్ లో అమితాబ్, కోలీవుడ్ లో రజనీకాంత్ లకు ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అమితాబ్ ...ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో అప్ డేట్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంచున్నారు.

Source: http://www.sakshi.com/news/movies/pawan-kalyan-mania-in-twitter-200424
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మానియా Rating: 5 Reviewed By: DMM