Latest News
Tuesday 6 January 2015

పవన్ అభిమాని గొంతు కోసిన దుండుగుల ఫొటోల విడుదల

పవన్ అభిమాని గొంతు కోసిన దుండుగుల ఫొటోల విడుదల


‘గోపాల గోపాల’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ టికెట్ల కోసం గొడవపడి పవన్ కల్యాన్ అభిమాని  కరుణ శ్రీనివాస్‌పై దాడి చేసి గొంతు కోసిన దుండగుల ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక ఆవరణలో ఆదివారం కొందరు యువకులు శ్రీనివాస్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడి జరుగుతున్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను సేకరించారు.

గొంతుకోసిన నిందితుడితో పాటు దాడికి పాల్పడ్డ వారి ఫొటోలను పోలీసులు మీడియాకు సోమవారం విడుదల చేశారు. వారి వివరాలు తెలిసిన వారు మాదాపూర్ పోలీస్‌స్టేషన్ లేదా ఫోన్ నెంబర్ 9493549415, 9491030063 లకు తెలియజేయాలని ఎస్‌ఐ నరేష్ కోరారు. ఇదిలా ఉండగా...  సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.


Source:http://www.sakshi.com/news/hyderabad/photos-released-to-cut-the-throat-of-a-fan-of-pawan-kalyan-201268

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: పవన్ అభిమాని గొంతు కోసిన దుండుగుల ఫొటోల విడుదల Rating: 5 Reviewed By: DMM