Latest News
Friday 2 January 2015

యూట్యూబ్ లో బాబాయ్.. అబ్బాయ్ యుద్ధం

యూట్యూబ్ లో బాబాయ్.. అబ్బాయ్ యుద్ధం


ఒకవైపు అబ్బాయి.. మరోవైపు బాబాయి.. ఇలా ఇద్దరూ పోటీలు పడి టీజర్లు విడుదల చేసి అభిమానులను ముంచెత్తారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ నటించిన టెంపర్, లయన్ సినిమాల టీజర్లు విడుదలయ్యాయి. వాటి విశేషాలు చూద్దాం..

''ఇద్దరు కొట్టుకుంటే అది యుద్ధం.. ఒక్కడు మీద పడితే అది దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర..'' అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన టెంపర్ ఏ రేంజిలో ఉంటుందో ప్రేక్షకులకు ఓ శాంపిల్ చూపించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న టెంపర్ సినిమా టీజర్ ను డిసెంబర్ 31 అర్ధరాత్రి విడుదల చేశారు. యూట్యూబ్ లో ఇది సంచలనం సృష్టించడం మొదలుపెట్టేసింది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఫేస్ బుక్  పేజీలో కూడా టీజర్ షేర్ చేసుకున్నారు.

''కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్‌లో కనపడుతుంది, నేను కొడితే.. హిస్టరీలో వినబడుతుంది''... ఇదీ లయన్ సినిమా టీజర్ లో నందమూరి బాలకృష్ణ డైలాగు. ఈ టీజర్ ను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.15 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ టీజర్ లో బాలయ్య మార్కు పంచ్ డైలాగులు కనిపించాయని అభిమానులు అంటున్నారు. టీజర్ పెట్టి ఇంకా ఒక్క రోజు కూడా కాకముందే లక్ష మందికి పైగా అభిమానులు దాన్ని యూట్యూబ్ లో చూశారు.

Source: http://www.sakshi.com/news/movies/ntr-and-balakrishna-release-teasers-simultaneously-in-youtube-200170
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: యూట్యూబ్ లో బాబాయ్.. అబ్బాయ్ యుద్ధం Rating: 5 Reviewed By: DMM