Latest News
Friday 30 January 2015

బాహుబలి-1 లో అనుష్క లేదా

బాహుబలి-1 లో అనుష్క లేదా?



బాహుబలి సినిమాలో అనుష్క లేదా ? అని ఆశ్చర్యపోకండి. ఈ సినిమాలో అనుష్కనే హీరోయిన్. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం బాహుబలి. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ లో విడుదలవుతున్న బాహుబలి-1 లో మాత్రం అనుష్క ఉండదట. దాంతో ఆమె మొదటి పార్ట్ లో కనిపించదని , రెండో పార్ట్ లో మాత్రం పూర్తిగా ఆమెనే కనిపిస్తుందని అంటున్నారు.

తోలి భాగంలో ప్రభాస్ సరసన తమన్నా కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. మొదటిపర్ట్ విడుదలైన ఓ రెండుమూడు నెలల తర్వాత పార్ట్ 2 వచ్చే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా అనుష్క అభిమానులకి ఇది షాకింగ్ న్యూస్. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. శోభు యార్లగడ్డ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Source: http://www.andhravilas.net/te/bahubali-1-lo-anushka-leda-585390.html
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: బాహుబలి-1 లో అనుష్క లేదా Rating: 5 Reviewed By: DMM