Latest News
Friday 2 January 2015

'ఐ' కథ ఇదేనన్న శంకర్‌

'ఐ' కథ ఇదేనన్న శంకర్‌

గత కొంతకాలంగా వెబ్‌మీడియాలో... విక్రమ్‌, శంకర్‌ కాంబినేషేన్‌లో వస్తున్న 'ఐ' చిత్ర కథ గురించి కథనాలు వస్తున్నాయి. ఈ కథపై దర్శకుడు శంకర్‌ హైదరాబాద్‌లో వివరించారు... హీరో బాడీబిల్డర్‌ కావాలనేది జీవితాశయం. అందుకు తన బాడీని రకరకాలుగా మార్చుకోవాలి. బాడీబిల్డర్‌ అనగానే.. హాలీవుడ్‌ నటుడు ఆర్నార్డ్‌ గుర్తుకువస్తారు. ఆయన కేశాలంకరణకూడా భిన్నంగా వుంటుంది. విక్రమ్‌ను పిలిచి అలా వుండాలన్నాను. దానికి హాలీవుడ్‌ టీమ్‌కూడా పనిచేసింది. ఆర్నార్డ్‌లా జట్టు పెట్టుకోవడం కష్టమైనా.. బాడీ పెంచడం కష్టమైనా.. ఏమాత్రం భయపడకుండా విక్రమ్‌ బాడీని పెంచేశాడు. ఇందుకోసం దేశంలో ముఖ్యమైన బాడీబిల్డర్‌ను పిలిపించి వారి చేత కొన్ని సీన్‌లుకూడా చేశాం. ఈ చిత్రకథకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత బాడీలో కొన్ని మార్పులుకూడా కావాలి. గూనివాడి పాత్రను మేకప్‌తో సరిపెట్టవచ్చని చెప్పాను. కానీ తనకుతానే బాడీని తగ్గించుకొన్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్యకు చెప్పాను. రేపు నా తప్పులేకుండా వుంటుందని మీకు చెబుతున్నట్లు వెల్లడించాను. కానీ ఆయన చాలా ఆనందంగా బాడీని మార్చుకుంటున్నాడని ఆమె చెప్పడంతో... విక్రమ్‌కు నటనపై ఎంత తపన వుందో అర్థమయింది. ఈ చిత్రం విజువల్‌గా చూడాల్సిందే. సంక్రాంతికి వస్తుంది అన్నారు.

            ఆస్కార్‌ ఫిలిం ప్రై. లిమెటెడ్‌ పతాకంపై వి.రవిచంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అవుతుంది. తెలుగు ఆడియో ఆవిష్కరణ మంగళవారంరాత్రి హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది.
              ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ... సాధారణంగా నేను చేసే సినిమాల తాలూకు విశేషాలు ఏవీ బయటకు రాకుండా జాగ్రత్త పడతాను. ఈ సినిమా విషయానికి వస్తే ట్రైలర్స్‌, మేకింగ్‌ వీడియోలు రిలీజ్‌ చేయడం వల్ల అంచనాలు బాగా పెరిగిపోయాయి. అయితే సినిమా మీద మా యూనిట్‌లోని అందరికీ పూర్తి నమ్మకం వుంది. ఇది ఒక రొమాంటిక్‌ థ్రిల్లర్‌. ఇప్పటి వరకు నేను చేయని జోనర్‌ ఇది. ఇందులో మంచి మెసేజ్‌ కూడా వుంది. మా ఆడియో రిలీజ్‌కి టాలీవుడ్‌లోని ప్రముఖులంతా రావడం చాలా ఆనందంగా వుంది. రాజమౌళిగారి 'మగధీర' చూసి ఆయనకు ఫ్యాన్‌ అయిపోయాను. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన 'ఈగ' చూసిన తర్వాత ఆయన మీద నాకు వున్న అభిమానం ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు రాజమౌళిగారు చేస్తున్న 'బాహుబలి' కూడా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో వుంటుంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను తెలుగులో ఒక్కటి కూడా స్ట్రెయిట్‌ మూవీ చెయ్యలేదు. 

            చేద్దామని రెండుసార్లు ట్రై చేసినప్పటికీ కుదరలేదు. అయితే భవిష్యత్తులో తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేసే ఆలోచన వుంది. 'ఐ' సినిమా విషయానికి వస్తే శ్రీరామకృష్ణగారి డైలాగ్స్‌గానీ, అనంత్‌శ్రీరామ్‌, రామజోగయ్యశాస్త్రి, చంద్రబోస్‌, సుద్ధాల అశోక్‌తేజ్‌ చాలా మంచి సాహిత్యం అందించారు. మా హీరో విక్రమ్‌ గురించి చెప్పాలంటే సినిమా అంటే అతనికి పిచ్చి. డెడికేటెడ్‌ ఆర్టిస్ట్‌. డేడికేషన్‌ ఉన్న నటుడు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. ఇక మా ప్రొడ్యూసర్‌ గురించి చెప్పాలంటే ఈ సినిమా అనుకున్నప్పుడు సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుండాలని ఆయన చెప్పారు. దాంతో ఈ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ని ట్రై చేశాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది' అన్నారు.

        ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలుపుతూ... ప్రేమికుడు చిత్రంలోని 'ముక్కాలా ముకాబులా' పాటను చేసి ఆ పాటను ఎలా పిక్చరైజ్‌ చేశారా అని ఆలోచించేవాడిని. నేను డైరెక్టర్‌ అయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌, మేకింగ్‌ వీడియో చూసి ఈ సినిమా ఎలా చేశారా అని అనుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలర్స్‌ చూసినప్పటికీ ఈ సినిమా కథ ఏమిటో తెలియకుండా బాగా ప్లాన్‌ చేశారు. శంకర్‌గారు. విక్రమ్‌ అద్భుతమైన ఆర్టిస్టు. ఒక సినిమా కోసం బాడీ బిల్డ్‌అప్‌ చేశారు, అలాగే సన్నబడ్డారు కూడా. నిజంగా ఆయన డెడికేషన్‌ చాలా గొప్పది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నాను. 

విక్రమ్‌ మాట్లాడుతూ.. ఇందులో నేను చేసిన క్యారెక్టర్ల కోసం బరువు పెరగడం, తగ్గడం చేశాను. వాటి కోసం ఎనిమిది నెలలు కష్టపడ్డాను. అయితే ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ చేశానన్న సంతృప్తి నాకు వుంది. ఈ సినిమాలో ప్రతి సీన్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ఎన్‌.వి.పసాద్‌ మాట్లాడుతూ... సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగులో ఆల్‌ టైమ్‌ ఆల్‌టైమ్‌ రికార్డుని క్రియేట్‌ చేస్తుంది.

Source: http://www.prajasakti.com/index.php?srv=10301&id=1261004

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: 'ఐ' కథ ఇదేనన్న శంకర్‌ Rating: 5 Reviewed By: DMM