Latest News
Friday 16 January 2015

మహేష్‌బాబుతో రజనీకాంత్‌

మహేష్‌బాబుతో రజనీకాంత్‌


మహేష్‌బాబు సినిమాలో రజనీకాంత్‌ నటిస్తున్నాడా? అవుననే అంటున్నాయి ఫిలింనగర్‌ వర్గాలు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా చేయాలని ఓ సీనియర్‌ నిర్మాత ప్రయత్నాల్లో ఉన్నారు కానీ అది నిజం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈలోగా ఈ ఇద్దరినీ ఒకే చిత్రంలో కలిపి చూపించడానికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల పావులు కదుపుతున్నాడు. మహేష్‌తో అతను తీయబోతున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రంలో రజనీకాంత్‌ ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌ చేస్తారట.

పివిపి బ్యానర్‌పై రూపొందే ఈ చిత్రం మే నెల తర్వాత మొదలు కానుంది. నిజంగా ఇందులో రజనీకాంత్‌ నటించినట్టయితే ఇక ఈ చిత్రం బాక్సాఫీస్‌ రేంజ్‌ని ఊహించుకోవడం కూడా కష్టమే. మహేష్‌, రజనీ విడివిడిగా చేస్తేనే వారి సినిమాలకి బాక్సాఫీస్‌ షేక్‌ అయిపోతుంది. ఇక ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఈ కాంబినేషన్‌ ఇంకా ఖరారు కాలేదు కానీ ప్రయత్నాలైతే ముమ్మరంగా జరుగుతున్నాయి. తప్పకుండా ఈ కలయిక నిజమవుతుందని ఆశిద్దాం.

See more: http://www.telugu-film.com/2012/03/tollywood-hero-photos-telugu-flm-actors.html
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మహేష్‌బాబుతో రజనీకాంత్‌ Rating: 5 Reviewed By: DMM