Latest News
Friday 16 January 2015

ఐ ఫ్లాప్ కి పది రీజన్లు

ఐ ఫ్లాప్ కి పది రీజన్లు


ఐ సినిమా కోసం సినిమాభిమానులు ఎంతగా ఎదురుచూసారో చెప్పడానికి కొలమానాలు లేవు. తెలుగు సినిమా ప్రముఖ దర్శకులు కూడా ఓ సాధారణ ప్రేక్షకుల మాదిరిగా ఉదయం తొమ్మిదిగంటల ప్రదర్శనకే తరలి వచ్చారంటే ఆ సినిమాపై ఏర్పడిన ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. సినిమాలో డైరక్టర్ పేరు తెరపై పడినపుడు జనాలు కొట్టిన చప్పట్లు చెబుతాయి..ఆయనపై జనాలకు వున్న అభిమానాన్ని. అలాంటి సినిమా జనాలను ఊహించనంత డిస్సపాయింట్ చేసింది ఐ సినిమా. ఎందుకు..ఏం తప్పిదాలు జరిగాయి ఐ సినిమాలో?
  • నిడివి ఐ సినిమాకు కీలక సమస్య. మూడు గంటల ఎనిమిది నిమషాలు. పోనీ నిడివికి తగినంత కథ, కథనాలు, మలుపులు వున్నాయా అంటే లేనే లేవు. కథ సాదీ సీదా, సామాన్య ప్రేక్షకుడి అంచనాల పరిథిలోనే 'సాగు'తూ వెళుతుంది. పోనీ సంఘటనలు ఎక్కువ వున్నాయి. అందువల్ల నిడివి పెరిగింది అనుకంటే, అదీ కాదు. అక్కర్లేని వ్యవహారాలు చాలా వున్నాయి. సబ్బులు, రంగులు, ఇలా రకరకాల ప్రొడక్టు ప్రకటనలు రూపొందించడంలో దర్శకుడు తన సృజన అంతా చూపించాడు. సినిమాల నడుమ ప్రకటనలు చూసినట్లయింది.
  • గే పాత్ర అన్నది సినిమాను మరింత అసహ్యం చేసింది. శంకర్ లాంటి దర్శకుడి నుంచి రావాల్సిన క్యారెక్టర్ కాదు అది. దానికి బదులు మరో హీరోయిన్ నే స్టయిలింగ్ అసిస్టెంట్ గా పెట్టి, జెలసీ ఫీల్ అయినట్లు చేసి వుంటే, సినిమాకు అదనపు అందం సమకూరేది.
  • సినిమాలో మాంచి కీలమైన ఫైట్ వస్తుందనుకుంటే, దానికి ముందు వెనుక సీన్లు దాని పట్ల ఉత్కంఠను పెంచేవిగా వుండాలి. చైనాలో చిత్రీకరించిన కీలమైన సైకిల్ పైట్ వ్యవహారం దీనిని భిన్నంగా సాగుతుంది. దాంతో ప్రేక్షకుడు దాన్ని ఎంజాయ్ చేయలేడు.
  • మన బి సి సెంటర్ల జనాలు ఓ తరహా స్క్రీన్ ప్లేకు అలవాటు పడిపోయి వున్నారు. అలా కాకుండా ఇది. అది కలిపి,కొంచెం కొంచెం నెరేట్ చేసుకుంటూ వెళ్తే, వాళ్లికి సంతృప్తిగా వుండదు.
  • సినిమాలో మూడు వంతులు కురూపి క్యారెక్టరే వుంటుంది. అలాంటపుడు డ్రీమ్ సాంగ్ పెట్టినపుడు, కనీసం అందంగా చూపించాలి కదా? అది వదిలేసి మళ్లీ మరో జంతువులాంటి క్యారెక్టర్ డిజైన్ చేయడం అవసరమా? ఒకే ఒక్కడులో ఇలాంటి పాటను గ్రాఫిక్స్ తో ఎంత అంతంగా చిత్రీకరించారు శంకర్..గుర్తుంది ఇప్పటికీ జనాలకు. 
  • అసలు కురూపి పాత్ర అంత సేపు వుంటే జనాలు ఎలా సినిమా చూడగలరు? భైరవద్వీపంలో బాలకృష్ణ కాస్సేపు కనిపిస్తేనే, కథాను సారం జనం తప్పక చూసారు. ఇక్కడ పోనీ ఏదైనా అందంగానో, లేక చూడదగ్గది గానో వున్న మరో రూపం అంటే కాదు. అసహ్యంగా వుండే రూపం. జనాలు సినిమాను అందంగా చూడడానికే ఇష్టపడతారు తప్ప,మరోలా కాదు. పైగా ఇది చాలదన్నట్లు విలన్లు అందరినీ అంతకు అంత అసహ్యంగా తయారుచేసి, 70 ఎంఎం స్క్రీన్ మీద చూడడం అంటే,
  • అసలు శంకర్ సినిమా అంటేనే భారీగా వుండాలి. అలాంటి సినిమాకు ఇంత థిన్ లైన్ స్టోరీ అంటే ఎలా సరిపోతుందని అనుకున్నారో అర్థం కాదు.
  • సినిమాలో అన్నింటికన్నా పెద్ద మైనస్ విలనిజం. తొలి సీన్ లోనే..డోంట్ కాల్ మి అంకుల్ అని అన్నపుడే సురేష్ గొపి విలన్ అని చిన్న పిల్లాడు కూడా చెప్పేస్తాడు. ఇంకేముంటుంది ఆసక్తి. 
ఇలా రకరకాలుగా తప్పిదాలు చేసి, అసలు ఇది శంకర్ సినిమానా? శంకర్ తీసిన సినిమానా అనేటట్లు చేసారు. బహుశా ఈ అయిదారేళ్లలో ఇంతలా నిరుత్సాహ పరిచిన సినిమా మరోటి లేదేమో.



See more: http://telugu.greatandhra.com/articles/chanakya/i-flop-ki-padi-reasons-58888.html
  • Blogger Comments
  • Facebook Comments

1 comments:

  1. Really funny .. u r just like 1 in common audien... !! shankar dnt need to change the story to make u impress... its apt for it ..may 1 r 2 crect.. not not 10... movie is gud than ur negative review.

    ReplyDelete

Item Reviewed: ఐ ఫ్లాప్ కి పది రీజన్లు Rating: 5 Reviewed By: DMM